
కర్నూలు, 02 ఆగస్టు (హి.స.) గత నెల రోజులుగా కొండెక్కి కూర్చున్న చికెన్, గుడ్ల ధరలు ఎట్టకేలకు క్రమంగా దిగివస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ ఊరట లభించింది. రెండు వారాల క్రితం వరకు కిలో రూ. 300 నుంచి రూ. 330 వరకు పలికిన స్కిన్లెస్ చికెన్ ధర ప్రస్తుతం రూ. 250 నుంచి రూ. 280 మధ్యకు చేరుకుంది. అలాగే ఒక్కో గుడ్డు రిటైల్ ధర రూ. 8 నుంచి రూ. 9 వరకు ఉండగా, ప్రస్తుతం రూ. 6 నుంచి రూ. 7 వరకు తగ్గి లభిస్తుంది. దిగుబడి పుంజుకోవడం, డిమాండ్లో మార్పులు రావడంతోనే ఈ ధరల తగ్గుదల నమోదైనట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు.
ప్రాంతాల వారీగా చూస్తే..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో స్కిన్లెస్ చికెన్ కిలో ధర అత్యల్పంగా రూ. 250 గా ఉండగా, కడప, మార్కాపురం జిల్లాల్లో రూ. 260 ఉండగా, గుంటూరులో రూ. 280 వద్ద నమోదైంది. నెల రోజులుగా మాంసం, గుడ్ల ధరల భారాన్ని మోసిన సామాన్యులు ధరలు తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక హైదరాబాద్, కామారెడ్డిలలో రూ. 270, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో రూ. 280 గా విక్రయిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV