కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నూతన పరిశ్రమల స్థాపనపై మంత్రుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నూతన పరిశ్రమల స్థాపనపై మంత్రుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన
kakatiya


వరంగల్: , 02 ఆగస్టు (హి.స.)

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఈ రోజు ఉదయం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. పార్కులో మౌలిక వసతుల కల్పన, విద్యుత్ మరియు నీటి సరఫరా పనుల పురోగతిని మంత్రులు స్వయంగా పరిశీలించారు. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోయిన స్థానిక రైతులకు రావలసిన నష్టపరిహారం మరియు పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande