ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి
ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి
ponnam


ఖమ్మం:, 02 ఆగస్టు (హి.స.)

ఖమ్మం నగరంలోని ప్రధాన బస్సు నిలయాన్ని అత్యాధునిక వసతులతో పునర్నిర్మించే పనులకు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఈ రోజు ఉదయం అధికారికంగా శంకుస్థాపన చేశారు. ప్రయాణికులకు మెరుగైన రక్షణ, ఆధునిక విశ్రాంతి గదులు మరియు డిజిటల్ సమాచార బోర్డుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రతి బస్సు నిలయంలోనూ ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande