
కరీంనగర్, 02 ఆగస్టు (హి.స.)
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా లోయర్ మానేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు ఈ రోజు ఉదయం నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. మానేరు నది పరివాహక ప్రాంతంలో ప్రవాహం ఎక్కువగా ఉన్నందున నది దాటే ప్రయత్నాలు చేయవద్దని, పశువులను నది వైపు తీసుకెళ్లవద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్ తీరప్రాంత గ్రామాల ప్రజలను హెచ్చరించారు. రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది సహాయంతో తీరప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi