
హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసి నది పునరుజ్జీవన మరియు సుందరీకరణ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ రోజు ఉదయం నుండి నగరపాలక సంస్థ మరియు రెవెన్యూ అధికారులు మూసి నది పరివాహక ప్రాంతాలలో ఉమ్మడి సర్వేను ప్రారంభించారు. నది గర్భంలో మరియు బఫర్ జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. బాధితులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ గృహ వసతి కల్పించేందుకు అవసరమైన నివేదికలను కూడా అధికారులు క్షేత్రస్థాయిలో సిద్ధం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi