
నల్గొండ: , 02 ఆగస్టు (హి.స.)
ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం నాటికి జలాశయం నీటి మట్టం గణనీయంగా పెరగడంతో అధికారులు నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండటంతో నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాలు పచ్చదనంతో ముస్తాబయ్యాయి. సెలవు దినం కావడంతో ఈ రోజు ఉదయం నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో సాగర్ తీరానికి చేరుకుని ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi