ఏపీ అభివృద్ధిలో ఆస్ట్రేలియా భాగస్వామ్యం.. మంత్రి లోకేశ్ చొరవతో 4 ఎంఓయూలు
ఏపీ అభివృద్ధిలో ఆస్ట్రేలియా భాగస్వామ్యం.. మంత్రి లోకేశ్ చొరవతో 4 ఎంఓయూలు
Lokesh


హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇరుప్రాంతాల మధ్య అభివృద్ధి, నైపుణ్యం, ఆవిష్కరణలే లక్ష్యంగా నాలుగు కీలక రంగాల్లో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. గతేడాది తాను ఆస్ట్రేలియాలో జరిపిన పర్యటన సందర్భంగా జరిగిన చర్చలకు ఇది కార్యాచరణ రూపమని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుదిరాయి. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, అత్యాధునిక తయారీ, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో ఈ భాగస్వామ్యం కీలకం కానుంది. ప్రతిభ, ఆవిష్కరణ, ఉమ్మడి శ్రేయస్సు పునాదులపై ఆంధ్రప్రదేశ్-ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా బృందం సీఎం చంద్రబాబుతోనూ సమావేశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande