పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటన
పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటన
palamuru


మహబూబ్‌నగర్: , 02 ఆగస్టు (హి.స.)

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గుండెకాయ లాంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం ఈ రోజు ఉదయం పంప్ హౌస్ మరియు రిజర్వాయర్ పనులను పరిశీలించింది. రాబోయే కాలంలో సాగునీరు మరియు తాగునీటి కొరత రాకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిపోయిన పనులను గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలను అధికారులు ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి అడ్డంకులను స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande