
హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం సచివాలయంలో పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో ఒక అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని, మత్తు పదార్థాల రవాణాకు పాల్పడే ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు యువతలో అవగాహన పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi