
తిరుచానూరు, 02 ఆగస్టు (హి.స.) తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు పత్రికా ప్రకటన ద్వార తెలిపారు.
శుక్రవారం సందర్భంగా ఈ నెల 7, 14, 28వ తేదీల్లో సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించున్నారని వెల్లడించారు. ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా 25న శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంటలకు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారని పేర్కొన్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 21న సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరగనుందని వెల్లడించారు.
బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో..రోహిణి నక్షత్రం సందర్బంగా 8న శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం.
సుందరరాజ స్వామి ఆలయంలో..ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా 3, 30వ తేదీలల్లో సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరింపు.
సూర్యనారాయణ స్వామి ఆలయంలో... హస్త నక్షత్రం సందర్భంగా 17న సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు కటాక్షం.
తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో..8, 15, 22, 29వ తేదీలలో వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు అభిషేకం.
అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..4న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
శుక్రవారం సందర్భంగా 7, 14, 21, 28వ తేదీలలో ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం. 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.
26న శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం. 2, 9, 16, 23, 30వ తేదీలలో ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV