తిరుమలకు రికార్డుస్థాయి హుండీ ఆదాయం.. వివరాలు వెల్లడించిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం నమోదైంది.
తిరుమల


తిరుమల, 02 ఆగస్టు (హి.స.) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం నమోదైంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీకి ఒక్క జులై నెలలోనే ఏకంగా రూ.140.28 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఆలయ చరిత్రలోనే ఒకే నెలలో ఈ స్థాయిలో హుండీ కానుకలు లభించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఈ రికార్డు స్థాయి ఆదాయంతో పాటు భక్తుల రద్దీ కూడా విశేషంగా నమోదైంది. జులై నెలలో 24.52 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవుల ముగింపు, వరుస పాఠశాలల ప్రారంభం ఉన్నప్పటికీ భక్తులు విపరీతంగా తిరుమలకు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి విచ్చేసిన భక్తులు తమ మొక్కులను కానుకల రూపంలో హుండీలో సమర్పించుకోవడంతో ఈ సరికొత్త రికార్డు నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande