
హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.)
సికింద్రాబాద్:
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఏడాది భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి పోలీస్ శాఖ తొలిసారిగా సరికొత్త కృత్రిమ మేధస్సు సాంకేతికతతో కూడిన నిఘా కెమెరాలను రంగంలోకి దించింది. ఈ అధునాతన సాంకేతికత ద్వారా ఎక్కువ మంది గుమికూడే ప్రాంతాలను ముందే గుర్తించి తొక్కిసలాటలు జరగకుండా నియంత్రించనున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi