శ్రావణమాస శోభతొ కళకళలాడుతున్న మార్కెట్లు
శ్రావణమాస శోభతొ కళకళలాడుతున్న మార్కెట్లు
శ్రావణమాస శోభతొ కళకళలాడుతున్న మార్కెట్లు


అమరావతి, 20 ఆగస్టు (హి.స.)

శ్రావణమాస శోభతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అరటి మార్కెట్ కళకళలాడుతోంది. పండుగలు, పూజల నేపథ్యంలో అరటిపండ్లకు డిమాండ్ పెరగడంతో.. మార్కెట్ యార్డ్ మొత్తం రైతులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. అరటి గెలలకు భారీ గిరాకీ రావడంతో ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో ఒక్కో అరటి గెల ధర రూ.800 నుంచి రూ.1,000 వరకు పలుకుతోంది. గత 15 రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అరటి దిగుబడి తగ్గడం, మరోవైపు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలు వచ్చాయి.

శ్రావణమాసంలో పూజలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో స్థానికంగా అరటిపండ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్కు తగిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ధరలు మరింత పెరుగుతున్నాయి. దీంతో చాలాకాలం తర్వాత రావులపాలెం అరటి మార్కెట్లో శ్రావణ సందడి కనిపిస్తోంది. కోనసీమలో పండించే అరటికి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు భారీగా అరటి కొనుగోళ్ల కోసం రావులపాలెం మార్కెట్కు క్యూ కడుతున్నారు. దీంతో మార్కెట్ యార్డ్ నిత్యం రద్దీగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande