ఆదాయానికి మించి ఆస్తులు.. ఏవో శ్రీనివాస్లెడ్డి ఇళ్లపై ఏసీబీ సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులు.. ఏవో శ్రీనివాస్లెడ్డి ఇళ్లపై ఏసీబీ సోదాలు
ACB


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారి శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్టీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గతంలో మహేశ్వరం తహసీల్దార్ (ఎమ్మార్వో)గా విధులు నిర్వహించారు.

ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. శ్రీనివాల్రెడ్డికి సంబంధించిన సుమారు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇళ్లు, ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల పత్రాలు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande