
హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)
ఏపీలో ప్రభుత్వ సెలవులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. మిలాద్ ఉన్ నబీ Milad-un-Nabi) పండగ సెలవు తేదీని మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం మత పెద్దల అభ్యర్థన, నూతన చంద్ర దర్శనం ఆధారంగా పూర్వపు సెలవు దినంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను విడుదల చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం (Telangana)లో కూడా 'మిలాద్ ఉన్ నబీ' పబ్లిక్ హాలిడేను ఆగస్టు 26నే ఖరారు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆగస్టు 26వ తేదీనే 'మిలాద్ ఉన్ నబీ' సెలవు దినంగా అమలు కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు