
నారాయణపేట, 20 ఆగస్టు (హి.స.) నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి మల్లెపల్లి సమీపంలో నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి రావడంతో పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.
ఇదిలా ఉండగా మక్తల్ పట్టణంలో గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు మక్తల్ టోల్దేట్ దగ్గర మంత్రి వాకిటి శ్రీహరి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. మంత్రికి స్వాగతం పలకడానికి వచ్చిన బంజారా లంబాడి మహిళలు మంత్రికి బంజారా సంప్రదాయ స్త్రాలంకరణ చేసి, ఆమెతో పాటు నృత్యం చేయించారు. అక్కడి నుంచి డప్పుల మోతతో మోటార్సైకిళ్ల ర్యాలీని పట్టణంలోని అతి పురాతనమైన నల్లజానమ్మ మందిరం వరకు కొనసాగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు