
సిద్దిపేట, 20 ఆగస్టు (హి.స.)
ఎల్-నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, అధిక నీటి అవసరం ఉన్న వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలని సిద్దిపేట జిల్లా డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ రోజు(గురువారం) జగదేవపూర్ రైతు వేదికలో జరిగిన అవగాహన సదస్సుకు డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో, వేసవిలో నీటి ఎద్దడి తప్పదని అధికారులు తెలిపారు.
ఆయిల్పామ్, కందులు, మినుములు, సజ్జ, రాగి, ఆముదం, పొద్దుతిరుగుడు, వేరుశనగ, కూరగాయల వంటి పంటలను, మార్కెట్ను బట్టి ఎంచుకోవాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఫామ్ పాండ్లు నిర్మించాలని, ప్రతి చుక్క నీటిని పొదుపుగా వాడాలని వివరించారు. పరిమిత నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు