
వనపర్తి, 20 ఆగస్టు (హి.స.)
జాతీయ రహదారి-44పై నిబంధనలు
ఉల్లంఘిస్తూ ప్రయాణిస్తున్న వాహనాలపై వనపర్తి జిల్లా ఆర్టీఓ అధికారి సురేష్కుమార్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. కొత్తకోట మండలం జాతీయ రహదారికి సమీపంలో వాహనాలను తనిఖీ చేసి, ఫిట్నెస్ లేని వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సురేష్కుమార్ మాట్లాడుతూ.. ఎన్హెచ్-44పై అధిక లోడుతో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రయాణానికి బొలెరో తదితర వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించవద్దని సూచించారు. బొలెరో వాహనదారులు అధిక లోడ్తో లేదా ప్రయాణికుల భద్రతకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశామని, నిర్ణీత వేగ పరిమితిని మించి ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..