గ్రామీణ రోడ్లకు మహర్దశ.. మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ..!
గ్రామీణ రోడ్లకు మహర్దశ.. మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ..!
Minister


పెద్దపల్లి, 20 ఆగస్టు (హి.స.) పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇంతకాలం ఇరుకు రోడ్లతో ఇబ్బందులు పడిన ప్రజలు, వాహనదారులకు రానున్న రోజుల్లో సమస్యలు తొలగనున్నాయి. రోడ్డు రవాణా సులభతరం కానుంది. రోడ్ల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల పల్లెల అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మొదటి దశలో హైమ్ పథకం కింద గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయించారు. దీంతో పల్లె రోడ్ల వెడల్పు నిర్మాణంతో ప్రజలకు, ప్రయాణికులకు రవాణా సుగమం కానుంది. దీంతో ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

మండలంలో మొదటి దశలో హైమ్ పథకం కింద సూరయ్యపల్లి నుంచి కాకర్లపల్లి మీదుగా శుక్రవారం పల్లి వరకు సుమారు 10.9 కి.మీ. మేర రోడ్డు నిర్మాణానికి రూ. 29.94 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అదే విధంగా గుంజపడుగు నుంచి విలోచవరం మీదుగా ఉప్పట్ల, పోతారం వరకు రూ.8.78 కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఇన్నేళ్లుగా ఇరుకుగా ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు కావడంతో సమస్యలు తొలగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande