నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని హెచ్చరిక
నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని హెచ్చరిక
talasani


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు ఈరోజు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానానికి తగినట్లుగా తన రాజకీయ భాషను మార్చుకోవాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో హెచ్చరించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి కేవలం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తోందని తలసాని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande