
సాలూరు, 26 ఆగస్టు (హి.స.)
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోడ కూలి అరుణ్ తేజ అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ చెక్కును బుధవారం మంత్రి సంధ్యారాణి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పరిహారం అందించడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. మృతి చెందిన విద్యార్థి చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. మంత్రి వెంట తెదేపా పట్టణ అధ్యక్షులు చిట్టి, దళిత సంఘం నాయకులు, డిప్యూటీ డీఈఓ రాజ్ కుమార్, హెచ్ఎం జ్యోతి ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ