ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. మర్యాద దక్కదు! ఆంధ్రా మీడియాకు రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. మర్యాద దక్కదు! ఆంధ్రా మీడియాకు రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Mla


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు,

తనపై దుష్ప్రచారం చేస్తూ వార్తను వండివార్చుతున్న ఆంధ్ర మీడియాకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థపై రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. సదరు ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని.. లేకుంటే మర్యాద దక్కదని ఫైర్ అయ్యారు. ఒకవేళ నా ప్రతాపమే చూపిస్తే ఓ ఛానల్, పేపరే ఉండదని.. సదరు మీడియా అధిపతికి చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తెలంగాణ (Telangana)లో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఎంతోమంది ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసలైన కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలము తామని.. పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రం గురించి కొట్టాడిన చరిత్ర తమదని తెలిపారు. మా లాంటి వ్యక్తులను కూడా కించపరిచే విధంగా, క్యారెక్టర్లను దెబ్బతీసే విధంగా వార్త పత్రికలు, న్యూస్ ఛానళ్లు వార్తలు వస్తే బాగుండదని అన్నారు. మీడియా (Media), జర్నలిస్టులు(Journalists) అంటే తనకు గౌరవం ఉందని.. కానీ, మీడియా ముసుగులో తమ వ్యక్తిత్వాన్ని హననం చేద్దామని చూడటం మంచింది కాదన్నారు. తాను అన్ని మీడియా సంస్థలను అనడం లేదని.. ఎవరైతే వ్యక్తులకు పనిచేస్తూ.. కొమ్ము కాస్తున్నారో వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నానని అన్నారు. తమకు కూడా 100 ఛానళ్లు పెట్టే దమ్ము, ధైర్యం ఉందని.. అంద మీడియా చానళ సరిఫికెట్ మాకు అక్కర్లేదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande