నీట్ పీజీ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.. ఇబ్రహీంపట్నం పోలీసులు
నీట్ పీజీ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.. ఇబ్రహీంపట్నం పోలీసులు
Police police


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

ఈ నెల 30న నిర్వహించనున్న

నీట్ పీజీ (నీట్ - పీజీ) ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు బుధవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసీపీ కేపీవీ. రాజు, సీఐ మద్ది మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి శ్రీ చక్ర కాలేజీలోని టీసీఎస్ ఐఓఎన్ డిజిటల్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని సీసీటీవీ కెమెరాల పనితీరు, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభ్యర్థులతో పాటు వారితో వచ్చే తల్లిదండ్రులకు కూడా పరీక్ష పూర్తయ్యే వరకు అవసరమైన సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నీట్ పీజీ ప్రవేశ పరీక్షను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande