దుకాణం లో వ్యాపారం చేసుకుంటున్న.మహిళ మెడలో 5 లక్షల విలువ చేసే బంగారం చోరీ చోరీ
దుకాణం లో వ్యాపారం చేసుకుంటున్న.మహిళ మెడలో 5 లక్షల విలువ చేసే బంగారం చోరీ చోరీ
దొంగ


అమరావతి, 26 ఆగస్టు (హి.స.)

సర్వేపల్లి దుకాణంలో వ్యాపారం చేసుకొంటున్న ఓ మహిళ మెడలోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామంలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ మెడలో ఉన్న 32 గ్రాముల పుస్తెలతాడుతోపాటు మంగళసూత్రం, కాసులను దుండగులు లాక్కెళ్లారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande