
గుంటూరు:, 26 ఆగస్టు (హి.స.)
ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన గుంటూరు మిర్చి యార్డ్‌కు ఈరోజు భారీగా సరుకు తరలివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ మిర్చికి, ప్రత్యేకించి తేజ మరియు దేవి రకాలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో క్వింటాల్ మిర్చి ధర రికార్డు స్థాయికి చేరింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించింది. యార్డ్ ప్రాంగణంలో రైతులు ఆరుబయట వేచి ఉండకుండా నీడ మరియు తాగునీటి వసతులు కల్పించినట్లు యార్డ్ చైర్మన్ తెలిపారు. మద్దతు ధర దక్కడంతో పాటు సకాలంలో నగదు చెల్లింపులు జరుగుతుండటంపై మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi