
భూపాలపల్లి, 26 ఆగస్టు (హి.స.)
మహిళల సంక్షేమానికి ప్రజాపాలన ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం చిట్యాల మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు మహిళా సంఘాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వీవో భవన నిర్మాణాలకు వీవీబీజీ రామ్ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో ముచినిపర్తి, గుంటూరుపల్లి, ఒడితల, దూతుపల్లి గ్రామాల్లో వీవో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
మండలంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. వీవో భవన నిర్మాణాలను 50 రోజుల్లో, దసరా నాటికి పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు