
కాకినాడ: , 26 ఆగస్టు (హి.స.)
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ మరియు పరిసర తీర ప్రాంతాలలో రాగల 48 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో కాకినాడ పోర్టు వద్ద మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే సురక్షిత తీర ప్రాంతాలకు తిరిగి రావాలని మత్స్యశాఖ అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేపట్టారు. తుఫాను ముప్పు ఎదుర్కొనేందుకు వీలుగా తీరప్రాంత గ్రామాల్లో సహాయక పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi