
కామారెడ్డి, 26 ఆగస్టు (హి.స.)
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - ఎస్ఆర్ఎ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఆగస్టు 27న గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. ఎస్ఆర్ఎ ప్రక్రియను పారదర్శకంగా, లోపాలు లేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ సభల్లో ముసాయిదా ఓటర్ జాబితాతో పాటు మరణించిన ఓటర్లు, నివాసం మారిన వారు, డబుల్ ఎంట్రీలు, గైర్హాజరైన ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపిస్తారని తెలిపారు. ప్రతి ఓటరు సభకు హాజరై జాబితాను పరిశీలించి పేరు, చిరునామాలో తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వీఎలీ లు, సూపర్ వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని నోటీసుల జారీ, విచారణ, అభ్యంతరాల నమోదుపై అవగాహన కల్పిస్తారన్నారు. గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వి.విక్టర్ విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు