ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి.. ఖమ్మం జిల్లా కలెక్టర్
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి.. ఖమ్మం జిల్లా కలెక్టర్
Collector


ఖమ్మం, 26 ఆగస్టు (హి.స.)

ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పోలీసు అధికారులు, స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande