కృష్ణపట్నం పోర్టు విస్తరణ పనులు, పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు
కృష్ణపట్నం పోర్టు విస్తరణ పనులు, పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు
port


నెల్లూరు: , 26 ఆగస్టు (హి.స.)

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా కొత్త కార్గో టెర్మినల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ విస్తరణ ద్వారా ఓడరేవు యొక్క సరుకు రవాణా సామర్థ్యం రెట్టింపు కానుండటంతో పాటు కోస్తా ప్రాంతంలో పారిశ్రామిక పురోగతి మరింత వేగవంతం కానుంది. పోర్టు పరిసర ప్రాంతాల్లో కొత్తగా కేటాయించిన పారిశ్రామిక కారిడార్‌లో టెక్స్‌టైల్, ఫార్మా రంగానికి చెందిన పరిశ్రమలు నెలకొల్పేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా నెల్లూరు మరియు పరిసర జిల్లాల యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande