
ములుగు, 26 ఆగస్టు (హి.స.)
ఓటు హక్కు పొందేందుకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు అయిన విషయాన్ని తెలుసుకోవడానికి ఈ నెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల్లో సభలు నిర్వహించడం జరుగుతుందని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. సభసందర్భంగా సంబంధిత అధికారులు ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని, ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే తగిన ఆధారాలతో సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..