టీ కాంగ్రెస్లో కీలక పరిణామం.. భట్టితో కొండా మురళి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ
టీ కాంగ్రెస్లో కీలక పరిణామం.. భట్టితో కొండా మురళి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ
Congress


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఆమెపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనే సస్పెన్స్ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భర్త కొండా మురళి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. ఇవాళ ప్రజాభవన్లో భట్టిని కలిసి పార్టీలో ఇటీవల జరిగిన తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో భట్టితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడోసారని, అలాగే చిన్నారెడ్డి సైతం లైన్ దాటి మాట్లాడారని ఇక వీరిని ఉపేక్షిస్తే పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ (డీఏసీ) పీసీసీ చీఫ్ కు నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో కొండాపై వేటు తప్పదనే చర్చ జరుగుతున్న వేళ కొండా మురళి భట్టీ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది.

భటి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. మా బిడ్డ కొండా సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదన్నారు. ఆమె మనోభావాలు ఆమెకు ఉంటాయని ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదన్నారు. మాకు గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉందని మేం కాంగ్రెస్లోనే కొనసాగుతామన్నారు. ఓ బిల్లు విషయంలో భట్టిని కలిశానన్నారు.కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడనన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande