ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి.. వరంగల్ జిల్లా కలెక్టర్
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి.. వరంగల్ జిల్లా కలెక్టర్
Collector


వరంగల్, 26 ఆగస్టు (హి.స)

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం పల్లె దవాఖానాలో చిన్నారులకు వేస్తున్న వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఫార్మసీని సందర్శించి మందుల నిల్వలను తనిఖీ చేశారు. గడువు తీరిన (ఎక్స్పైరీ) మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఔషధాలను సురక్షితంగా భద్రపరచాలని స్పష్టం చేశారు. ల్యాబొరేటరీని సందర్శించి వైద్య సామగ్రి లభ్యతపై ల్యాబ్ ఇన్చార్జితో మాట్లాడారు. ల్యాబ్లో పాటు ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చిన రోగులతో (పేషెంట్లతో) కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో అందుబాటులో ఉంటున్నారా, మందులు ఉచితంగా ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande