అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్
హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Telangana govt logo


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) భాగ్యనగరంలో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలయ్యాయి. భూపాలపల్లితో పాటు హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లోని 12 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande