కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కదం తొక్కిన ఉద్యోగులు
కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కదం తొక్కిన ఉద్యోగులు
Rajanna


రాజన్న సిరిసిల్ల, 27 ఆగస్టు (హి.స.)

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం చేపట్టిన ధర్నాలో ఉద్యోగులు కదం తొక్కారు. 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాలు ఒకే వేదికపైకి రావడం ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని సంఘ నాయకులు తెలిపారు. పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డుల సమర్థ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, జీవో-25 సవరణ, జీవో-190 అమలు వంటి డిమాండ్లు ఉద్యోగుల హక్కులని, ఈ హక్కులను సాధించేది సంఘటిత ఉద్యమమేనని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 1న నిర్వహించే పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 10న జరిగే చలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఉద్యోగుల హక్కుల సాధన వరకు ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande