విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: రాంచందర్ రావు
విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: రాంచందర్ రావు
Bjp


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించి వారి గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు (N. Ramchandra Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రంలోని ఆయన 'గులాం'లు విద్యార్థుల ఆందోళనలను పెడచెవిన పెడుతున్నారని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్, ఆయుష్ (AYUSH) విద్యార్థులతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థి లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తుంటే.. విద్యార్థులంటే ఏనాడూ ప్రాధాన్యత లేని కాంగ్రెస్ సర్కార్ వారి నిరసనల ప్రతిధ్వనిని (Goonj) పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తనను పోలీసులు అక్రమంగా గృహనిర్బంధం (House Arrest) చేయడాన్ని రాంచందర్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. హౌస్ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతును నొక్కేయవచ్చని ప్రభుత్వం భావిస్తే అది వారి భ్రమే అవుతుందని, ఎలాంటి నిర్బంధాలు తమను అడ్డుకోలేవని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల సాధన పోరాటంలో బీజేపీ ఎల్లప్పుడూ వారికి వెన్నంటే నిలుస్తుందని స్పష్టం చేసిన ఆయన, వివాదాస్పదమైన జీవో నెంబర్ 97 (G.O. 97)ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande