ఏపీ గ్రీన్ కార్యనిర్వహక కమిటీ చైర్మన్ గా నాగబాబు బాధ్యతలు స్వీకరించారు
ఏపీ గ్రీన్ కార్యనిర్వహక కమిటీ చైర్మన్ గా నాగబాబు బాధ్యతలు స్వీకరించారు
ఏపీ గ్రీన్ కార్యనిర్వహక కమిటీ చైర్మన్ గా నాగబాబు బాధ్యతలు స్వీకరించారు

అమరావతి, 28 ఆగస్టు (హి.స.)

, ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా నాగబాబు బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు(శుక్రవారం) మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఛైర్మన్గా నాగబాబు బాధ్యతలు చేపట్టారు. నాగబాబుకి వేదపండితులు వేదఆశీర్వచనం అందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande