బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ కల సాకారం.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ కల సాకారం.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Telangana


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని నిరీక్షిస్తున్న బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి' పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విడతలో మొత్తం 350 మంది అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో బీసీ విద్యార్థులు 250 మంది, ఈబీసీ విద్యార్థులు 100 మంది ఉంటారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ (డిగ్రీలో) కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విదేశాల్లో నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించాలనే పేద, మధ్యతరగతి బీసీ, ఈబీసీ విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు ఈ పథకం కింద ప్రభుత్వం భారీగా ఆర్థిక సాయం అందించనుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande