రాఖీ రద్దీ.. కిక్కిరిసిన కామారెడ్డి బస్టాండ్
రాఖీ రద్దీ.. కిక్కిరిసిన కామారెడ్డి బస్టాండ్
Rakhi


కామారెడ్డి, 28 ఆగస్టు (హి.స.)

రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. పండుగను పురస్కరించుకుని సొంత ఊర్లకు, అన్నదమ్ముల ఇళ్లకు వెళ్లేందుకు మహిళలు, విద్యార్థులు భారీగా తరలిరావడంతో శుక్రవారం ఉదయం నుంచే బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ప్లాట్ ఫాం లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన రద్దీకి తగ్గట్లుగా సరిపోవడం లేదు. బస్సు రాగానే సీట్ల కోసం ఎగబడుతున్నారు. బస్సు ఎక్కేందుకు మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది గంటల తరబడి బస్టాండ్ లోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల్లో సీట్లు దొరక్క కిక్కిరిసి, ఫుట్ బోర్డులపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రయాణం సురక్షితంగా లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా పండుగ వేళ అదనపు బస్సులు పెంచినప్పటికీ ప్రయాణికులకు సరిపోని పరిస్థితి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande