
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర
స్వామివారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, నటి కాజోల్ కుమార్తె నిసా దేవగన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేద పండితులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదాలు పొందారు.నిసా దేవగన్ కీసరగుట్టకు రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. అనంతరం అలా మండపంలో నిసా దేవగన్ కి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమెను చూసేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపారు. కాగా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రముఖులు, సినీ తారలు ఆలయాన్ని సందర్శించడం భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు