రూ.5 భోజనం నాణ్యతపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
రూ.5 భోజనం నాణ్యతపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
Warangal


వరంగల్, 28 ఆగస్టు (హి.స.)

ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో

బల్దియా సహకారంతో హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో భోజనం, పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. భోజనం చేస్తున్న వినియోగదారులతో మాట్లాడి రుచి, నాణ్యత, సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రూ.5కే అందిస్తున్న భోజనం నాణ్యంగా, రుచికరంగా ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ డాక్టర్ రాజేష్ తదితర అధికారులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande