మరో పది రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత జాబితాను విడుదల చేస్తాం.. మంత్రి పొంగులేటి
మరో పది రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత జాబితాను విడుదల చేస్తాం.. మంత్రి పొంగులేటి
Pongulati


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కులం, మతం, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

శుక్రవారం హైదరాబాద్ లోని క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్ కోసం లాటరీ తీసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... మరో పది రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత జాబితాను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను సేకరించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో టవర్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.

ఏడాది లోపే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, వాటిని ఆడబిడ్డల పేరుమీద అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇళ్ల రిజిస్ట్రేషన్కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. అలాగే, ఇల్లు పొందిన వారు పదేళ్ల తర్వాత దానిని విక్రయించుకునే హక్కు ఉంటుందని తెలిపారు. ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అవసరమైతే దానిని తాకట్టు పెట్టుకుని రుణం పొందేందుకు కూడా అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande