ఆర్ఓబి లెవల్ క్రాసింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఆర్ఓబి లెవల్ క్రాసింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
కలెక్టర్


పెద్దపల్లి, 28 ఆగస్టు (హి.స.)

ప్రయాణికుల కష్టాలను తీర్చే విధంగా జిల్లాలో చేపడుతున్న రైల్వే వంతెన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీలో కన్నాల రైల్వే వంతెన పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ లెవల్ క్రాసింగ్ వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములుతో కలిసి సమీక్షించారు. గౌరెడ్డిపేట, కన్నాల, కుందన్పల్లి ప్రాంతాల్లో చేపడుతున్న లెవల్ క్రాసింగ్ సంబంధిత రహదారి, రైల్వే వంతెన పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని కలెక్టర్ తెలిపారు. పనుల పురోగతిలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి జాప్యానికి అవకాశం ఇవ్వకుండా పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande