బంగాళాఖాతంలో ఆవర్తనం – సెప్టెంబర్ 2 వరకు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక(update)
బంగాళాఖాతంలో ఆవర్తనం – సెప్టెంబర్ 2 వరకు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక
rain


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం (Cyclonic Circulation) ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం (Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో సెప్టెంబర్ 2 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, కృష్ణా, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కలెక్టర్లు జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande