భద్రకాళి చెరువుకు వరద ముప్పు .. అధికారులతో కలెక్టర్ సత్య శారద సమీక్ష
భద్రకాళి చెరువుకు వరద ముప్పు .. అధికారులతో కలెక్టర్ సత్య శారద సమీక్ష
Collector


వరంగల్, 28 ఆగస్టు (హి.స.)

భద్రకాళి చెరువు పరిధిలో వరద

నివారణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యల పై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ వర్షాకాలంలో తలెత్తే వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా భద్రకాళి చెరువు నీటి ప్రవాహం, వరద పరిస్థితులు, కాలువలు, నీటి విడుదల మార్గాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భారీ వర్షాల సమయంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరద నివారణ పనులను ముందుగానే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ అవసరమైన చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. చెరువు పరిధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమావేశంలో వరంగల్ ఆర్డీవో సుమ, ఇరిగేషన్ ఎస్ఈ రామ్ ప్రసాద్, ఈఈ కిరణ్, డీఈ మధుసూదన్ రెడ్డి, వరంగల్ ఖిలా వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande