రైతులకు.శుభవార్త.చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రైతులకు.శుభవార్త.చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ap


అమరావతి, 03 ఆగస్టు (హి.స.)

రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంశుభవార్త తెలిపింది. ఖరీఫ్ పంటల బీమా గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఖరీఫ్ పంటలకు బీమా నమోదు గడువును మరో 15 రోజులు పొడిగించినట్లు స్పష్టం చేసింది. జులై 31వ తేదీతో ముగియాల్సిన గడువుకు మరో 15 రోజులపాటు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, వర్షాభావం వల్ల పంట నష్టాలకు బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రూ.1 ప్రీమియంతో అన్నదాతలకు పంటల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏపీ సర్కార్ వివరించింది. ఇప్పటికి కూడా నమోదు చేసుకోని రైతులు వెంటనే బీమా నమోదు చేసుకోవాలని సూచించింది. సాగు చేసిన ప్రతి ఎకరానికి బీమా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బ్యాంకులు, సీఎస్సీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande