బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు.వ్యవస్త కృషి
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు.వ్యవస్త కృషి
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు.వ్యవస్త కృషి


జంగారెడ్డిగూడెం పట్టణం:, 05 ఆగస్టు (హి.స.)

బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని జంగారెడ్డిగూడెం డీఎస్పీ బీహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో చరవాణులు పోగొట్టుకున్న బాధితులకు ఇంటింటికి వెళ్లి మొబైల్ ఫోన్లను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో సుమారు 26 మంది బాధితులు మొబైల్స్ పోగొట్టుకున్నట్లు గుర్తించామని, వాటిని రికవరీ చేసి బాధితులకు అందించామని తెలిపారు. మొబైల్స్ రికవరీలో జిల్లాలోనే జంగారెడ్డిగూడెం ప్రథమ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande