ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కు.బెస్ట్ పెర్ఫార్మెన్స్ సొసైటీ అవార్డ్
ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కు.బెస్ట్ పెర్ఫార్మెన్స్ సొసైటీ అవార్డ్
ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కు.బెస్ట్ పెర్ఫార్మెన్స్ సొసైటీ అవార్డ్


ఆనందపురం, 05 ఆగస్టు (హి.స.)

: ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ సొసైటీ’ అవార్డు సొంతం చేసుకుంది. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీసీఓబీ) 63వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ, వసూళ్లు, సభ్యులకు మెరుగైన సేవలు, పారదర్శక పాలన, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 99 పీఏసీఎస్లలో ఆనందపురం సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షుడు పాండ్రంగి అప్పలరాజు మాట్లాడుతూ.. తాము బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఆనందదాయకమన్నారు. ఈ విజయానికి సహకరించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, డీసీసీబీ సీఈఓ డీవీఎస్ వర్మ, డీజీఎం ఎం.అశోక్కుమార్, టి.ప్రవీణ, జాయింట్ రిజిస్ట్రార్ కిరణ్ కుమారితో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande