నాగార్జునసాగర్ కి.59 ఏళ్లు
నాగార్జునసాగర్ కి.59 ఏళ్లు
నాగార్జునసాగర్ కి.59 ఏళ్లు


అమరావతి, 05 ఆగస్టు (హి.స.)

విజయపురిసౌత్, న్యూస్టుడే: బహుళార్థసాధక ప్రాజెక్టు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అన్నపూర్ణ, ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ జలాశయం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనప్పుడు ప్రజలే చేయిచేయి కలిపి నిర్మించిన వారధి ఇది. మానవ నిర్మిత మహాసాగరం. జలాశయం నిర్మాణానికి 1955లో దేశ మొదట¨ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డిసెంబరు 10న శంకుస్థాపన చేశారు. 1965లో డ్యాం పూర్తి కాగా.. కుడి, ఎడమ కాలువలు 1967 నాటికి నిర్మించారు. జలాశయం 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 1967 ఆగస్టు 4న జలాశయాన్ని జాతికి అంకితం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande