కృష్ణా నదికి.రక్షణ.కవచం
కృష్ణా నదికి.రక్షణ.కవచం
కృష్ణా నదికి.రక్షణ.కవచం


తాడేపల్లి, మంగళగిరి, 03 ఆగస్టు (హి.స.)

: ఎన్నికల సమయంలో కృష్ణానది వరద ముంపు నుంచి తమను కాపాడాలంటూ తాడేపల్లి పరిధిలోని సీతానగరం, మహానాడు ప్రాంతాలకు చెందిన ప్రజలు మంత్రి లోకేశ్ను కోరారు. రిటైనింగ్ వాల్ నిర్మించి రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయవాడ నగరాన్ని ఆనుకుని ఎడమ వైపున పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు నిర్మించిన రక్షణ గోడ తరహాలోనే..తాడేపల్లి పరిధిలోని సీతానగరం నుంచి కనక దుర్గమ్మ వారధి వరకు ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా 0.900 కి.మీ నుంచి 2.010 కి.మీ వరకు రూ.294.20 కోట్లతో గోడ నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో శంకుస్థాపన చేసిన ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. 12 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చినా తట్టుకునేలా అత్యంత నాణ్యతగా దీన్ని నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మహానాడు, సీతానగరం, సుందరయ్యకాలనీ ప్రాంతాల్లోని సుమారు 50 వేల మంది ప్రజలకు ముంపు ముప్పు తప్పుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande